అమెరికా మిస్సిసిప్పీ రాష్ట్రంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.
హట్టీస్బర్గ్ నగరంలోని ఓ ఇంటిపై ఈ విమానం కూలిందని అధికారులు తెలిపారు. మంగవారం రాత్రి 11.30 గంటల ముందే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు చనిపోయినట్లు తెలిపిన అధికారులు.. తర్వాత మరో ఇద్దరు మృతి చెందారని వెల్లడించారు.