కరోనా చికిత్సలో 'ఫ్లూవోక్సమీన్' ఔషధం సమర్థంగా పనిచేస్తోందని తాజా అధ్యయనాల్లో తేలింది. మానవ శరీర కణాల్లోకి సార్స్-కోవి-2 ప్రవేశించకుండా ఫ్లూవోక్సమీన్ సమర్థంగా అడ్డుకుంటోందని వెల్లడైంది. అందువల్ల ఈ ట్రయల్ డ్రగ్‌ను కరోనా చికిత్సలో ఉపయోగించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
'మహానుభావుడి' ఔషధం
ప్రస్తుతం ఓసీడీ మానసిక రుగ్మతతో బాధపడుతున్న వారికి యాంటీడిప్రెసెంట్ ఔషధంగా 'ఫ్లూవోక్సమీన్'ను ఉపయోగిస్తున్నారు. దీనిని కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించవచ్చా? లేదా? అనే విషయాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు.
"మానసిక రోగుల చికిత్సలో ఉపయోగించే ఫ్లూవోక్సమీన్ ఔషధాన్ని కొవిడ్-19 చికిత్సలో వాడడం విజ్ఞతతో తీసుకున్న నిర్ణయంగా అనిపించదు. అయితే కరోనా చికిత్సకు మలేరియా మందులు వాడడం కంటే ఇది చాలా నయం అని చెప్పవచ్చు"
- ఎరిక్ జె.లెంజ్, వాలెస్, లూసిల్ రెనార్డ్ సైకియాట్రీ ప్రొఫెసర్
పరిశోధనలు ఫలిస్తే..
వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం... సెలెక్టివ్ సిరోటోనిన్-రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ (ఎస్ఎస్ఆర్ఐ) అనే ఔషధ తరగతికి చెందినది ఫ్లూవోక్సమీన్. ఇది శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించే ప్రోటీన్‌ను ప్రభావితం చేస్తుంది. అంటే కరోనా వైరస్‌ను ప్రభావవంతంగా నిలువరించగలుగుతుంది.
ప్రస్తుతానికి కరోనాకు వైద్యపరంగా నిరూపితమైన యాంటీవైరల్ థెరపీ లేదు. ఇలాంటి సమయంలో 'ఫ్లూవోక్సమీన్'పై జరుగుతున్న పరిశోధనలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.
కరోనా... దశలు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంటువ్యాధుల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన కాలిన్ మాటార్ ప్రకారం కొవిడ్-19 రెండు కీలక దశలను కలిగి ఉంటుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ అయిన మొదటి దశలో... రోగుల్లో జ్వరం, దగ్గుతో పాటు ఇతర వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తరువాత ప్రాణాంతక జ్వరం వచ్చే దశ ఏర్పడుతుంది. దీనినే 'సైటోకిన్ తుపాన్' అంటారు. అయితే 'ఫ్లూవోక్సమీన్'... కరోనా రెండో దశను సమర్థంగా నిలువరించగలదని చెబుతున్నారు కాలిన్.
ఇదీ చూడండి:ప్రాణాలు కాపాడే యోధులపైనా కరోనా పంజా