తెలంగాణ

telangana

ETV Bharat / international

హెయిర్​​ కట్​ బాగోలేదని బార్బర్​పై కాల్పులు...! - అమెరికా టెక్సాస్​లో కాల్పుల కలకలం రేగింది. క్షౌరశాలలో బార్బర్​పై కాల్పులు జరిపి పరారయ్యాడు ఓ వ్యక్తి.

అమెరికా టెక్సాస్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. క్షౌరశాలలో బార్బర్​పై కాల్పులు జరిపి పరారయ్యాడు ఓ వ్యక్తి. తన కుమారుడి హెయిర్​​ కట్​ విషయంలో వివాదం చెలరేగడం వల్లే కాల్పులకు పాల్పడ్డాడని సమాచారం.

gun
బార్బర్​

By

Published : Dec 23, 2019, 4:26 PM IST

కొడుకు హెయిర్​​ కట్​ నచ్చలేదని బార్బర్​పైనే కాల్పులకు పాల్పడ్డాడు ఓ తండ్రి. అమెరికా టెక్సాస్​లోని ఓ క్షౌరశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ బార్బర్​ ఇప్పుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది.

'కటి' నగరంలోని హౌస్టన్​ శివారు ప్రాంతంలోని క్షౌరశాలలో కొడుకుకి క్షవరం చేయించాలని వచ్చిన ఓ వ్యక్తి.. బార్బర్​పై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బార్బర్​కు ఆ వ్యక్తికి మధ్య పిల్లాడి క్షవరం విషయంలో వాగ్వివాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగుడు మూడు సార్లు బార్బర్​పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు అధికారులు.

ఇదీ చూడండి : కార్చిచ్చు: కోలా దాహం తీర్చిన 'నీటి'దాతలు

ABOUT THE AUTHOR

...view details