తెలంగాణ

telangana

ETV Bharat / international

'కావాల్సింది లాక్​డౌన్​ కాదు వైరస్​ షట్​డౌన్'

అమెరికాలో కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించటాన్ని తోసిపుచ్చారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. కానీ, వైరస్​ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా మాస్క్​లు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై గవర్నర్లతో చర్చించినట్లు చెప్పారు. ఆర్థికాన్ని కాకుండా, వైరస్​ను మూసివేయబోతున్నట్లు తెలిపారు.

Jeo Biden
జో బైడెన్​

By

Published : Nov 20, 2020, 9:18 AM IST

అమెరికాలో కొద్ది రోజులుగా విజృంభిస్తున్న కొవిడ్ మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. కానీ, వైరస్​ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా మాస్క్​ తప్పనిసరి చేయాలని నొక్కి చెప్పారు.

" దేశంలోని వివిధ ప్రాంతాలు, వాటి విస్తీర్ణం, సమాజాలు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. అది దేశ ఉత్పాదకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నేను ఆర్థిక కాలాన్ని పూర్తిగా మూసివేయాలనుకోవట్లేదు, కానీ వైరస్​ను షట్​డౌన్​ చేయబోతున్నా. "

- జో బైడెన్​, అధ్యక్ష ఎన్నికల విజేత

వైరస్​ ఉద్ధృతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వ్యాయామశాలలు వంటివి 4 గంటల పాటు తెరుస్తున్నారని, అలాగే.. కొన్ని ప్రాంతాల్లో చర్చుల్లో 40 మందికి మినహా అనుమతించటం లేదని గుర్తుచేశారు బైడెన్​. అక్కడి వైరస్​ పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారని.. పూర్తిగా మూసివేయలేదన్నారు.

దేశవ్యాప్తంగా మాస్క్​ తప్పనిసరి..

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మాస్క్​ తప్పనిసరి అమలు చేయాల్సిన అంశంపై గవర్నర్లతో చర్చించినట్లు చెప్పారు బైడెన్​. ఇప్పటికే 10 మంది డెమొక్రటిక్​, రిపబ్లికన్​ గవర్నర్లు మాస్క్​ తప్పనిసరి చేసినట్లు గుర్తు చేశారు. ఇది రాజకీయ ప్రకటన కాదని, దేశం కోసం చేయాల్సిన విధిగా పేర్కొన్నారు. అలాగే కొవిడ్​ వ్యాక్సిన్​ నిర్వహణ, పంపిణీలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించినట్లు చెప్పారు బైడెన్​. ఇందు కోసం ఫెడరల్​ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. టీకా పంపిణీ బాధ్యత 33 కోట్ల మంది అమెరికన్ల భుజాలపై ఉందన్నారు.

ఇదీ చూడండి:అమెరికాలో ప్రతి నిమిషానికి ఒక కరోనా మరణం!

ABOUT THE AUTHOR

...view details