వేలానికి నిజాం నగలు, షాజహాన్ కత్తి అఖండ భారతాన్ని పాలించిన రాజులకు ఆభరణాలు అంటే ఎంతో మక్కువ. వారి వద్ద ఎన్నోరకాల వజ్రాలతో చేసిన నగలు ఉండేవి.
రాజుల ఆభరణాల్లో చాలా వాటిని సేకరించింది క్రిస్టీ సంస్థ. ప్రస్తుతం వాటిని వేలానికి పెట్టింది. ఈ నెల 19న అమెరికాలోని న్యూయార్క్‌లో వేలం వేయనుంది. ఇందుకు సన్నాహకంగా ఆయా ఆభరణాలతో ప్రదర్శన ఏర్పాటుచేసింది. భారతీయ చరిత్రకు అద్దంపట్టేలా ఉన్న ఆభరణాలు, ఆయుధాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రదర్శనలో ఉంచిన వాటిలో హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజుల ఆభరణాలూ ఉన్నాయి.
"వేలం వేయబోతున్న భారతీయుల అద్భుతమైన అలంకరణ కళ, ఆభరణాలు, చిత్రపటాలు, ఆయుధాలను మనం చూడబోతున్నాం. భారతీయ మొఘల్ చరిత్రలోని ప్రముఖ రాజులకు చెందిన పలు వస్తువులను చూస్తారు. షాజహాన్‌కు చెందిన బాకు (కత్తి), ఉంగరం చూస్తారు. జహంగీర్‌కు చెందిన రత్నముూ ఉంది."
- విలియమ్ రాబిన్సన్, క్రిస్టీ ప్రతినిధి
తాజ్‌మహల్ నిర్మించిన మొఘల్ రాజు షాజహాన్‌కు చెందిన ఉంగరం, బాకు (కత్తి) ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 19, 20వ శతాబ్దానికి చెందిన సుమారు 380 వరకు నగలు, వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.
ఇదీ చూడండి:పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?