కరోనాకు జన్యు మార్పిడి ఆధారిత టీకాను రూపొందిస్తున్నట్లు అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి తెలిపింది. 'ఆవ్‌కొవిడ్' పేరిట సిద్ధమవుతున్న ఈ టీకాకు సంబంధించిన ప్రయోగాలు, అభివృద్ధి వివరాలను ఇటీవల వెల్లడించింది. ప్రస్తుతం జంతువులపై పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలో మానవులపై ప్రయోగాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామంది.
జన్యు ఆధారిత టీకాతో కరోనాకు చెక్! - కరోనా టీకా
కరోనాకు 'ఆవ్ కొవిడ్' పేరిట జన్యు ఆధారిత టీకా రూపొందిస్తున్నట్లు అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ ఆసుపత్రి తెలిపింది. ఇందుకు సంబధించి ప్రస్తుతం జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించింది. త్వరలోనే మానవులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

కరోనాకు జన్యు ఆధారిత టీకా
జన్యు మార్పిడి ఆధారిత ఈ టీకాలో అడినో-అసోసియేటెట్ వైరస్(ఏఏవీ)లు ఉంటాయి. ఇతర వ్యాధులకు కారణం కాకుండా మనుషులపై ప్రభావం చూపే వైరస్‌లనే ఏఏవీలు అంటారు. కణాల్లోకి ఇతర జన్యు పదార్థాన్ని చొప్పించేందుకు శాస్త్రవేత్తలు 'వైరల్ వెక్టార్స్' అనే పరికరాలను ఉపయోగిస్తారు. ఈ పరిజ్ఞానంతో శరీరంలోకి కరోనా వైరస్ కొమ్ము(స్పైక్) ప్రతిజనకాన్ని (యాంటీజన్) పంపిణీ చేస్తారు. ఇది దేహంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక స్పందనను అభివృద్ధి చేస్తుంది.