తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్‌ పరీక్షలకు సరికొత్త స్వాబ్‌

కొవిడ్ పరీక్షలకు సంబంధించి స్వాబ్‌ పరీక్షలు చేయాలంటే గొంతు, ముక్కు లోపలి నుంచి నమూనాలు తీసుకోవాలి. వీటికి సంబంధించి పలుచటి దూదితో చేసిన పరికరాలను వాడాల్సి ఉంటుంది. అయితే అమెరికా పరిశోధకులు 3డీ విధానంలో వీటిని రూపొందించారు. మరింత సౌకర్యంగా ఉండటమే కాక, పరీక్షలు వేగంగా నిర్వహించేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

3d-nasal-swab-for-covid-19-testing
కొవిడ్‌ పరీక్షలకు సరికొత్త స్వాబ్‌

By

Published : Apr 9, 2021, 5:06 AM IST

అమెరికాలోని మాసాచూసెట్స్‌ మీడియా లాబ్‌లో 3డీ విభాగంలో పరిశోధకులు కరోనా పరీక్షలకు ఉపకరించే స్వాబ్‌లను మరింత సౌకర్యంగా ఉండేలా తయారు చేయడంతో కరోనా పరీక్షలు వేగంగా నిర్వహించేందుకు దోహదపడుతున్నాయి.. కొవిడ్ పరీక్షలకు సంబంధించి స్వాబ్‌ పరీక్షలు చేయాలంటే గొంతు, ముక్కు లోపలి నుంచి నమూనాలు తీసుకోవాలి. వీటికి సంబంధించి పలుచటి దూదితో చేసిన పరికరాలను వాడాల్సి ఉంటుంది. ఎంఐటీ లాబ్స్‌లోని ఓపీటీ సంస్థ 3డీ విధానంలో వీటిని రూపొందించింది. ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది లక్షల వరకు స్వాబ్‌లను అంకుర సంస్థ ఓపీటీ సరఫరా చేయడం విశేషం.

వెంట్రుక పరిమాణంలో

గత ఏడాదిగా ఓపీటీ సంస్థ వెంట్రుక పరిమాణం కలిగిన స్వాబ్‌లను తయారు చేయడంతో పాటు ఔషధ సంస్థలైన కైజర్‌ పర్మనెంట్‌.. తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొని స్వాబ్‌లను తయారుచేస్తోంది. స్వాబ్‌ల తయారీలో ఈ సంస్థ సిబ్బంది కొత్తగా 3డీ ప్రింటర్‌ను తయారు చేయడంతో పాటు, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. స్వాబ్‌ల కోసం ప్రత్యేకమైన పాలిమర్లను అభివృద్ధి చేయడం విశేషం. ఎంఐటీ సాండ్‌ బాక్స్‌, ఇ14 ఫండ్‌ అనే సంస్థలు ఓపీటీకి సహకారాన్ని అందించాయి. సరళమైన, మన్నికైన పదార్థాలతో కూడిన స్వాబ్‌లను తయారు చేయడంతో ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా స్వాబ్‌లకు కొరత ఏర్పడింది. దీంతో సంస్థకు చెందిన బృందం పరిశోధనలతో బాధితుల నుంచి ద్రవాలను గ్రహించడంతో పాటు పరీక్షల సమయంలో ఆ ద్రవాలు త్వరితంగా వచ్చేందుకు వీలుగా స్వాబ్‌లను తయారు చేశారు. ఫలితంగా మరింత వేగవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది.

తక్కువ ఖర్చుతోనే..

ఓపీటీకి అడిటివ్‌ తయారీ కూడా ఉండటంతో వెంట్రుకవాసి కలిగిన అతి సూక్ష్మమైన స్వాబ్‌లను తయారుచేసే సౌలభ్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రతిరోజూ 80 వేలకు పైగా స్వాబ్‌లను ఉత్పత్తి చేస్తోంది. కేవలం కరోనా పరీక్షలే కాకుండా ఇతర జబ్బులకు సంబంధించిన పరీక్షలకు నూతన పరికరాలపై ప్రయోగాలు చేస్తోంది. ఈ పరికరాలతో ఎక్కువ బాక్టీరియా/వైరస్‌ను సేకరించడంతో జబ్బు తీవ్రతను గుర్తించే వీలుంది. వచ్చే నెలలో ఓపీటీ ప్రాంగణం నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీంతో మరింత పరిశోధనలు, డిజైన్లకు సంబంధించి కంపెనీ పురోగతి సాధించనుందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్య జీవితంలో ఉపయోగపడే పలు పరికరాలను తయారు చేయడం ద్వారా తమ వాణిజ్యాన్ని మరింతగా విస్తరించనున్నట్టు వారు తెలిపారు. ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులను తయారు చేయనున్నామని స్వాబ్‌ తయారీ కేవలం ప్రారంభమని వారు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​తో రక్తం గడ్డ కట్టొచ్చు!

ABOUT THE AUTHOR

...view details