తెలంగాణ

telangana

ETV Bharat / international

సూడాన్​లో పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు

సూడాన్​లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన చేస్తోన్న ఆందోళనకారులను బలిగొన్న సైన్యం తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. తాజాగా సైనిక మండలి చర్చల ఆహ్వానాన్ని ఆందోళనకారులు తిరస్కరించారు.

By

Published : Jun 6, 2019, 7:12 AM IST

సూడాన్​లో పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు

సూడాన్​లో పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు

సూడాన్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. సూడాన్ అధినేత ఒమర్‌ అల్‌ బషీర్‌ నియంతృత్వ పాలన ముగిసిన తర్వాత సైన్యం తీరుకు నిరసనగా ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకూ 101 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిరసనల్ని భగ్నం చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో వందలాదిమంది గాయపడగా, తాత్కాలిక సైనిక మండలి చర్చల ఆహ్వానాన్ని ఆందోళనకారులు తిరస్కరించారు. న్యాయం, జవాబుదారితనం లేకుండా సైన్యం చేసే ఎలాంటి రాజకీయ ప్రక్రియ తమకు ఆమోదయోగ్యం కాదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

సూడాన్ అధినేత బషీర్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతుండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను అధ్యక్ష పదవి నుంచి సైన్యం గద్దె దించింది. మూడేళ్లలో ఎన్నికలు నిర్వహించి..ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

అప్పటి వరకు జనరల్ అబ్దెల్ -ఫతే-అల్ బుర్హాన్ నేతృత్వంలో సైనిక మండలి తాత్కాలికంగా పాలనా బాధ్యతలు చేపడుతుందని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గడువుకు ముందే ఎన్నికలు నిర్వహించాలంటూ సైనిక పాలనకు వ్యతిరేకంగా సుడాన్ ప్రజలు ఆందోళన బాట పట్టారు.

ABOUT THE AUTHOR

...view details