కరోనా లాక్‌డౌన్ కారణంగా.. కెన్యాలో పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కెన్యాలో ఆంక్షలు విధించడం వల్ల అక్కడి పేద ప్రజలకు పూట గడవడం కష్టతరంగా మారింది. నైరోబీలోని కిబెరా మురికి వాడలో నివసించే ప్రజల కోసం స్థానిక అధికారులు ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే భోజన ప్యాకెట్లు అందుకోవడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారంతా ఒక్కసారిగా ఆహారం కోసం ఎగబడ్డందున.. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. తప్పించుకునే క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. అనేక మంది గాయపడ్డారు.
పాకిస్థాన్లోనూ..