తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

కేసీఆర్ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి : ముఠా పద్మా నరేష్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు

గాంధీనగర్ డివిజన్ తెరాస పార్టీ అభ్యర్థి ముఠా పద్మా నరేష్ ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు తనను మరోసారి గెలిపిస్తామని చెప్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

కేసీఆర్ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి : ముఠా పద్మా నరేష్
కేసీఆర్ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి : ముఠా పద్మా నరేష్

By

Published : Nov 27, 2020, 3:47 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్​లోని వివేక్​నగర్, అశోక్​నగర్ తదితర ప్రాంతాల్లో తెరాస అభ్యర్థి ముఠా పద్మ నరేశ్​ జోరుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వందలాది పథకాలను అమలు చేసి అందరివాడుగా పేరుగాంచారని పద్మ నరేష్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు తాను రెండు పర్యాయాలు ప్రజల సమస్యలు పరిష్కరించానని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు దేశం మొత్తం గుర్తింపు లభించిందని.. ప్రచారంలో పాల్గొన్న జగిత్యాల జెడ్పి చైర్ పర్సన్ వసంత సురేష్ తెలిపారు. ప్రజల నుండి తెరాసకు మంచి స్పందన లభిస్తోందన్నారు.

కేసీఆర్ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి : ముఠా పద్మా నరేష్

ABOUT THE AUTHOR

...view details