తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ పని కూడా అయిపోయింది'.. సూపర్ అప్డేట్​ షేర్​ చేసిన సామ్​ - సమంత శాకుంతలం సినిమా

Samantha Shakunthalam Movie: డిఫరెంట్​ సినిమాలతో కెరీర్​లో దూసుకుపోతున్న సమంత.. ప్రస్తుతం పలు హీరోయిన్ ఓరియెంటెడ్​ చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో 'శాకుంతలం' ఒకటి. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్​ను షేర్​ చేసింది సామ్​.

Samantha wraps Shaakuntalam
Samantha wraps Shaakuntalam

By

Published : Apr 17, 2022, 3:29 PM IST

Samantha Wraps Shakunthalam: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్​ బిజీగా మారింది. వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. సమంత కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'శాకుంతలం'. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రంలో యువరాణి శకుంతలగా కనిపించబోతోంది సామ్. ఇప్పటికే షూటింగ్​ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా తన పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం' నుంచి కీలక అప్డేట్ ను షేర్ చేసింది సమంత.

సమంత షేర్​ చేసిన పోస్ట్​

Samantha Shakunthalam Movie: తాజాగా డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్.. తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది. దీంతో సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 'శాకుంతలం' మూవీ విడుదలకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే శాకుంతలం నుంచి విడుదలైన ఫస్ట్​లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె.. అల్లు అర్హ ఈ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతోంది. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్, దిల్ ​రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. . ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

Samantha Upcoming Movies: ఇక సమంత కొత్త చిత్రాల విషయానికొస్తే.. సామ్​ వరుసగా తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాతు వాకుల రెండు కాదల్' సినిమా షూటింగ్, డబ్బింగ్​ను సామ్ పూర్తి చేసింది. యశోద, సిటాడెల్, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలతో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇటు సినిమాలు చేస్తూనే అటు ఐటెం సాంగ్స్ కూడా చేసేస్తోంది సమంత. పుష్ప 2లో కూడా సామ్​తో మరో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.

ఇవీ చదవండి:రణ్​బీర్​ రెమ్యూనరేషన్​ రూ.70 కోట్లు! మరి ఆలియా లెక్క ఎంత?

దేవీశ్రీకి బంఫర్​ ఆఫర్​.. సల్మాన్​ఖాన్​తో మరోసారి!

ABOUT THE AUTHOR

...view details