వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం శోచనీయమని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్న ఇద్దరు అగ్ర హీరోలను పరిశ్రమ అవమానించడమేనని కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో దిల్ రాజు వెంటనే స్పందించి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనకు కట్టుబడి ఉన్నట్లు తెలపాలని కోరారు.
దిల్‌రాజు అలా చేస్తే చిరు, బాలయ్యను అవమానించినట్టే: సి.కల్యాణ్ - దిల్‌రాజుపై నిర్మాత కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
దిల్‌రాజుపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా చేస్తే చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్న అగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణను అవమానించినట్టేనని అన్నారు.
కాగా, కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనువాద చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదనే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగు నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. సంక్రాంతికి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్యతోపాటు దిల్ రాజు తమిళ్ లో నిర్మించిన వారసుడు విడుదలకానుంది. అయితే వారసుడుకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారనే వాదన రావడంతో తెలుగు నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై స్పందించిన నిర్మాత సి.కళ్యాణ్.... తమిళ, కన్నడ పరిశ్రమలో వాళ్ల సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలోనూ తెలుగు చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు వాళ్లే తెలుగు సినిమాను చంపుకోకూడదని కోరారు.
ఇదీ చూడండి:పవన్-హరీశ్ సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ డైరెక్టర్