PawanKalyan Ustaad : రీసెంట్గా 'బ్రో' చిత్రంతో అభిమానులను, సినీ ప్రియులను అలరించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో ఆడియెన్స్‌ను పలకించేందుకు రెడీగా ఉన్నారు. వాటిలో ఒకటి 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ustaadbhagat singh అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
వాస్తవానికి పవన్ కల్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మంచి స్నేహితులన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఆయనే ఈ కొత్త ఫొటోనూ పోస్ట్ చేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీసెట్స్లో పవన్‌తో కలిసి నడుస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా #UstaadBhagatSingh ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక 'ఈ ఫొటో ఎప్పుడు తీయించుకున్నారు?', 'ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు చేస్తారు', అంటూ నెట్టింట అభిమానులు ఈ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఎలాంటి సమాచారం లేకుండా పవన్ ఫొటో బయటకు వచ్చే సరికి అభిమానుల దిల్ ఒక్కసారిగా ఖుష్ అయిపోంది.