Spy movie Nikhil Apologises to fans : హీరో నిఖిల్ నటించిన 'స్పై' చిత్రం ఎన్నో అంచనాలతో ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే రిలీజ్‌కు ముందు అంచనాలు భారీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి మొదటి రోజు ఓపెనింగ్స్ మంచిగా వచ్చాయి. రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. కానీ టాక్ బాగోలేకపోవడం వల్ల రెండో రోజు నుంచి వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఇకపోతే సినిమా కూడా దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో ఆడియెన్స్‌కు అందుబాటులో లేదని తెలిసింది. దీనిపై సినీ ప్రియులు కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే నిఖల్.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు, తన అభిమానులకు క్షమాపణలు తెలిపారు. సోషల్‌మీడియాలో ఓ నోట్‌ను రిలీజ్ చేసి ఈ విషయంపై తాను కూడా చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై కంటెంట్, నిర్మాణ విలువలు అన్నీ క్వాలిటీతో ఉండేలా.. అలాగే సినిమా కూడా ప్రతీ ప్రేక్షకుడికి అన్నీ భాషల్లో అందుబాటులో ఉండేలా చూసుకుంటానని హామి ఇచ్చారు.
"నా కెరీర్‌లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్‌ను అందించినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నాపై మీరు ఇంత నమ్మకం ఉంచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాంట్రాక్ట్/కంటెంట్ డీలే సమస్యల కారణంగా.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో సినిమాను విడుదల చేయలేకపోయాం. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఓవర్సీస్లోనూ 350 తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. తర్వాత రాబోయే నా 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయని హామీ ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి, అభిమానులకి కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా నాణ్యత విషయంలో అస్సలు రాజీపడనను. అదీ . ఓ మంచి క్వాలిటీ సినిమాను మీకు అందిస్తాను" అని నిఖిల్ అన్నారు.