తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సితార డ్యాన్స్​ సూపర్​.. స్పెషల్​ వీడియోతో మహేశ్​​ దీపావళి విషెస్ - సితార డ్యాన్స్

సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఫ్యాన్స్​కు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. తన కూతురుకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో సితార ట్రెడిషనల్​ డ్యాన్స్​ చేసి అదరగొట్టేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Mahesh Babu special Deepavali wishes
సితార సూపర్​.. కూతురి డ్యాన్స్ వీడియోతో మహేశ్​​ దీపావళి విషెస్

By

Published : Oct 24, 2022, 12:14 PM IST

సూపర్ స్టార్ మహేశ్​ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిచ్చుబుడ్డిలాంటి ఈ చిన్నారికి సోషల్​మీడియాలో ఉన్న క్రేజ్​ గురించి తెలిసిందే. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా కనిపించే ఈ బుడ్డది.. చదువుతో పాటు పాశ్చత్య, సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మహేశ్ నటించిన చిత్రాల్లోని పలు పాటలకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకుంది. అయితే తాజాగా దీపావళి సందర్భంగా మహేశ్​ తన కూతురు చేసిన ఓ డ్యాన్స్​ వీడియోతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

"అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ జీవితాల్లో ప్రేమ, వెలుగు, సంతోషం ఎల్లప్పుడూ ఉండాలి" అనే క్యాప్షన్​తో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియో కొద్ది సేపట్లోనే రీ ట్వీట్స్​, లైక్స్​తో దూసుకుపోతోంది. మీరు కూడా ఈ డ్యాన్స్​ చూసేయండి..

కాగా, మహేశ్​ ప్రస్తుతం త్రివిక్రమ్​తో ఓ సినిమా చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమాలో మహేశ్​.. సరికొత్త లుక్​లో కనిపించనున్నారు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేశ్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉన్నాయి. పూజాహెగ్డే హీరోయిన్​. ఈ చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో భారీ స్థాయిలో పాన్​ ఇండియా ప్రాజెక్ట్​ చేయనున్నారు.

ఇదీ చూడండి:పవర్​ఫుల్​గా 'మెగా 154' టైటిల్​ టీజర్​.. చిరు లుక్​ అదిరిందిగా!

ABOUT THE AUTHOR

...view details