తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలీవుడ్​పై నేనలా అనలేదే.. మీకలా అర్థమైందా: మహేశ్​ - మహేశ్​బాబు సర్కారు వారి పాట

Maheshbabu Bollywood comments: బాలీవుడ్​పై తాను చేసిన కామెంట్స్‌ గురించి వివరణ ఇచ్చారు సూపర్​స్టార్​ మహేశ్ బాబు. తాను అన్ని భాషలను గౌరవిస్తానని చెప్పారు. అర్థమైందా?

mahesh babu bollywood comments
మహేశ్​బాబు బాలీవుడ్​ కామెంట్స్​

By

Published : May 11, 2022, 2:06 PM IST

Maheshbabu Bollywood comments: బాలీవుడ్ తనను భరించలేదన్న వ్యాఖ్యలపై మహేశ్‌బాబు వివరణ ఇచ్చారు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్​కు రీచ్​ అవ్వాలనేదే తన కోరిక అని చెప్పారు.

"బాలీవుడ్‌పై నేను ఎప్పుడు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్‌ సినిమాలు చేయనని చెప్పలేదు. తెలుగు సినిమా సౌకర్యంగా ఉందని చెప్పాను. మన చిత్రాలు బాలీవుడ్‌కి రీచ్‌ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా దూసుకెళ్లటం సంతోషకరం. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. నాకు సినిమాలు అంటే ఇష్టం. ఇక రాజమౌళితో చేయబోయే చిత్రం పాన్ ఇండియా సినిమానే." అని మహేశ్​ అన్నారు.

అంతకుముందు ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ.. "ఇది గర్వంగా అనిపించొచ్చు. నాకు హిందీ నుంచి చాలా ఆఫర్స్​ వచ్చాయి. కానీ బాలీవుడ్​ నన్ను భరించలేదని భావిస్తున్నాను. నాకు వచ్చిన హిందీ చిత్రాల అవకాశాలను వినియోగించుకుంటూ సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదు. తెలుగు చిత్రసీమలో నాకున్న స్టార్​డమ్​, ఇక్కడివారు చూపించే ప్రేమ వల్ల ఇతర ఇండస్ట్రీకి వెళ్లాలన్న ఆలోచన కూడా లేదు. ఎప్పటికీ ఇక్కడే సినిమాలు చేయాలి, అవి భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని భావిస్తాను. నా బలం, ఎమోషన్​ తెలుగు సినిమా. తెలుగు సినిమా అనేదే ఓ భావోద్వేగం. భారతదేశంలోని ప్రజలందరూ తెలుగు చిత్రాలను చూడాలని నేనెప్పుడు కోరుకుంటాను. ప్రస్తుతం అది జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది." అని అన్నారు.

ఇదీ చూడండి: 'రూ.3వేలు సంపాదించడం కష్టమైపోయింది'.. కమల్ మాజీ భార్య భావోద్వేగం..!

ABOUT THE AUTHOR

...view details