తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2023, 6:54 PM IST

ETV Bharat / entertainment

బడ్జెట్ రూ.6లక్షలు.. కలెక్షన్స్​ రూ.800 కోట్లు.. ఈ సినిమా రికార్డ్​ను బ్రేక్ చేయడం అసాధ్యం!

Low Budget High Collection Movies : భారత్​లో తక్కువ బడ్జెట్​తో రూపొంది.. దాదాపు 2వేల శాతం లాభాలు పొందింది 'కశ్మీర్ ఫైల్స్' సినిమా. అప్పుడు ఇదే పెద్ద సెన్సేషన్​ అని భారత సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. మరి ఓ హాలీవుడ్ సినిమా అతి తక్కువ బడ్జెట్​తో రూపొంది.. సుమారు 13 లక్షల శాతం ప్రాఫిట్స్ పొందింది అన్న విషయం మీకు తెలుసా? మరి అది ఏ సినిమా అంటే!

Low Budget High Collection Movies
చిన్న బడ్జెట్ ఎక్కువ లాభాలు

Low Budget High Collection Movies : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'కశ్మీర్ ఫైల్స్' తక్కువ బడ్జెట్​తో రూపొంది.. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా నిర్మాణానికి రూ. 15 కోట్లు ఖర్చు కాగా.. థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో రూ.341 కోట్ల వసూళ్లు సాధించింది. కాగా ఈ సినిమా లాభం దాదాపు 2000 శాతం. అయితే దేశంలో ఎక్కువ శాతం లాభాలు అర్జించిన సినిమాగా కశ్మీర్ ఫైల్స్ నిలిచింది. కానీ ప్రపంచ స్థాయిలో ఏకంగా 13,30,300 శాతం లాభాలు పొందిన సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం..

'Paranormal Activity' Profit Collections : 'పారానార్మల్ యాక్టివిటీ' అనే హాలీవుడ్ సినిమా 2007లో.. తక్కువ బడ్జెట్​లో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ రీతిలో కలెక్షన్లు వసూల్​ చేసింది. ఈ సినిమా బడ్జెట్.. అప్పట్లో 15000 (అప్పటి డాలర్ రేటు ప్రకారం.. సుమారు రూ. 6 లక్షలు) డాలర్లు. అయితే పారామౌంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ.. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి.. క్లైమాక్స్​ను మార్చారు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనంగా మూవీమేకర్స్.. 2,15,000 (రూ. 96 లక్షలు) డాలర్లు ఖర్చుచేసింది. అయితే ఇంత తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ సినిమా.. థియేటర్లలో రిలీజై 193 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 800 కోట్లు ) వసూల్ చేసింది. దీంతో 'పారానార్మల్ యాక్టివిటీ' సినీ పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

Paranormal Activity Sequels : 'పారానార్మల్ యాక్టివిటీ' సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల మూవీమేకర్స్.. దీనికి ఆరు సీక్వెల్స్​ను తెరకెక్కించారు. ఈ ఆరు సీక్వెల్స్​ను 28 మిలియన్ ( దాదాపు రూ.230 కోట్లు) డాలర్లతో రూపొందిస్తే.. ప్రపంచవ్యాప్తంగా 890 మిలియన్ (సుమారు రూ. 7320 కోట్లు) డాలర్ల కలెక్షన్స్ సాధించింది. అయితే అప్పటినుంచి ఇంత భారీ మొత్తంలో వసూళ్లు మరి ఏ ఇతర సినిమాకు సాధ్యం కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు...

  • 1999లో 'ది బ్లెయిర్ విచ్' అనే సినిమా 2,00,000 (రూ.85 లక్షలు) డాలర్ల బడ్జెట్​తో రిలీజై.. 243 మిలియన్ (దాదాపు రూ.1045 కోట్లు) లాభాలు ఆర్జించింది.
  • 2003లో 'టార్నేషన్' చిత్రాన్ని కేవలం 218 ( రూ. 10వేలు) డాలర్లతో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ ( రూ. 5.5 కోట్లు )డాలర్ల వసూళ్లు తెచ్చిపెట్టింది.
  • ఇక 1972లో డీప్ థ్రోట్ అనే మరో హాలీవుడ్ సినిమాకు.. 25000 (రూ.1.9 లక్షలు) డాలర్ల బడ్జెట్​ అయ్యింది. కాగా ఈ సినిమా 22 మిలియన్ (రూ. 17 కోట్లు) డాలర్లు కలెక్షన్లు సాధించింది.
  • 1977లో 'ఎరేజర్ హెడ్' అనే హర్రర్ మూవీ.. 10వేల డాలర్లు (రూ. 87000)తో నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్​గా నిలిచి 7 మిలియన్ (రూ. 6కోట్లు) డాలర్ల వసూళ్లు సంపాదించింది.
  • ఇవి చదవండి :
  • Ram Charan G20 Summit : హాలీవుడ్​ ఎంట్రీపై హింట్ ఇచ్చిన చెర్రీ!
  • అంతర్జాతీయ వేదికపై 'కశ్మీర్‌ ఫైల్స్‌' వివాదం.. స్టార్ యాక్టర్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details