Hanuman Director Prasanth Varma : 'జాంబీ రెడ్డి' తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ - ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ 'హనుమాన్'. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే రీలీజైన టీజర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది మూవీ టీమ్. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ తో వచ్చిన టీజర్‌కు అశేష స్పందన లభించగా, తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా అంచనాలు మించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. అయితే సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం' సినిమాకు పోటీగా రానుంది. అయితే ఈ ప్రశ్నకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైెరెక్టర్ ప్రశాంత్ వర్మ సమాధానం ఇచ్చారు.
'మాది చిన్న చిత్రమే అయినా అందరికన్నా పెద్ద హీరో హనుమంతుడు మా అండగా ఉన్నారనే ధైర్యంతో మేము వస్తున్నాం. అంతే కాదు తెలుగులో 400 థియేటర్స్‌లో, హిందీలో 1500 పైగా స్క్రీన్లలో ఈ 'హనుమాన్' సినిమా విడుదల కావటం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మరిన్ని థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.' అని ప్రశాంత్ వర్మ చెప్పారు. అలానే సినిమా విడుదల తేదీ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచే ఈ డేట్‌ను ప్రకటించామని అంతే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల ఈ చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తున్నామంటూ స్పష్టంగా చెప్పారు ప్రశాంత్ వర్మ.