రాముడి పాత్రలో ఓం రౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్'. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌పై సినీ అభిమానులతో పాటు, విమర్శకులు సైతం పెదవి విరిచారు. సోషల్‌మీడియాలో అయితే, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో టీజర్‌ని 3డీలో స్క్రీనింగ్ వేశారు. దీనిని చూసిన వారందరూ యూట్యూబ్‌లో విడుదలైన టీజర్‌ను 3డీలో చూస్తుంటే అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. విజువల్ వండర్‌గా ఓం రౌత్‌దీన్ని తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సోషల్‌మీడియాలో ట్రోల్‌పై దర్శకుడు ఓం రౌత్ కూడా స్పందించారు.
"ఆది పురుష్ టీజర్ విడుదలైన తర్వాత వస్తున్న ట్రోలింగ్ చూసి నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం. అయితే, ట్రోలింగ్ వల్ల నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా వెండితెర కోసం తీశాం. థియేటర్‌లో తెరసైజు తగ్గచ్చేమో కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. అలా చేస్తే, అస్సలు బాగోదు. నాకు అవకాశం ఇస్తే, యూట్యూబ్‌లో పెట్టకుండా చేయొచ్చు. నాకు అది కేవలం ఓ గంట పని. కానీ, అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనూ యూట్యూబ్ ఆడియెన్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం" అని అన్నారు.