'వెన్నెల' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు దేవ కట్టా. 2005లో విడుదలైన ఈ మూవీ.. అప్పటి యువతను బాగా ఆకట్టుకుంది. అనంతరం, 2010లో 'ప్రస్థానం' సినిమాను తెరకెక్కించారు. సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ చిత్రం పలు బాషల్లో డబ్ కూడా అయ్యింది. ఆ తర్వాత ఆయన తీసిన 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్', 'రిప్లబిక్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు దేవ కట్టా.
లాంగ్ గ్యాప్ తర్వాత 'ప్రస్థానం' డైరెక్టర్.. ఒకేసారి 4 సినిమాలు ప్రకటన - డైరెక్టర్ దేవ కట్టా లేటెస్ట్ ట్విట్టర్ అప్‌డేట్
'వెన్నెల', 'ప్రస్థానం' లాంటి హిట్ సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి అందించిన దర్శకుడు దేవ కట్టా.. 2021లో విడుదలైన 'రిపబ్లిక్' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ విరామం తీసుకుంటున్న సమయంలో ఆయనపై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెడుతూ ఫ్యాన్స్ కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి నాలుగు సినిమాలు ప్రకటించారు. ఆ వివరాలు..
దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఓ గుడ్ న్యూస్‌తో తిరిగొచ్చారు. 2021లో వచ్చిన 'రిపబ్లిక్' తర్వాత ఆయన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు.. ప్లానింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ వివరాలను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా 2020లోనే ప్రకటించిన 'ఇంద్రప్రస్థం' వెబ్‌సిరీస్‌తో పాటు జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న ఓ రచన ఆధారంగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లు ఉన్నాయ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని వెల్లడించారు.
మరోవైపు, రెండు భాగాలుగా విడుదల కానున్న ఓ సినిమా కోసం కూడా పనిచేస్తున్నట్లుగా దేవ కట్టా తెలిపారు. దీంతో పాటు ఆధునిక ప్రపంచంలో నడిచే ఓ స్టోరీతో ఒక స్క్రిప్ట్‌ను రాస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నాలుగు ప్రాజెక్ట్‌ల గురించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తానని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా 'ప్రస్థానం' సినిమాతో మంచి గుర్తింపు పొందిన దేవ కట్టా.. రచయితగా కూడా పేరొందారు. అలా 'బాహుబలి' చిత్రంలోని పలు సన్నివేశాలకు ఆయన మాటలు రాశారు. అంతే కాకుండా 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.