మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ ముందు ఇంకా తన జోరును కొనసాగిస్తోంది. విడుదలై 17 రోజులు అవుతున్నా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందిన వివరాలు ప్రకారం.. 17వ రోజు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో.. నైజంలో రూ.85 లక్షలు, సీడెడ్ లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 43 లక్షలు, ఈస్ట్ లో రూ. 24 లక్షలు, వెస్ట్ లో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షల షేర్ కలక్షన్స్ సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ సినిమా 17వ రోజు రూ. 1.40 కోట్ల షేర్ కలెక్షన్స్, 3.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలిసింది.
మొత్తంగా 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో.. నైజంలో రూ. 34.21 కోట్లు, సీడెడ్ లో రూ.17.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.18.40 కోట్లు, ఈస్ట్ లో రూ.10.64 కోట్లు, రూ. వెస్ట్ లో రూ. 5.92 కోట్లు, గుంటూరులో రూ. 7.58 కోట్లు, కృష్ణ లో రూ. 7.37 కోట్లు, నెల్లూరులో రూ. 4.35 కోట్లు.. మొత్తంగా రూ. 97.93 షేర్, రూ. 171.93 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట.