Bhagvant Kesari OTT Release Date : వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకుంటున్న సీనియర్ హీరో నటసింహాం నందమూరి బాలకృష్ణ. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాస్ బాస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో ఉన్న ఆయన.. ఇప్పుడు తాజాగా 'భగవంత్ కేసరి'తో వచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా కానుకగా నేడే (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి టాక్ వస్తోంది(Bhagvant Kesari Twitter Review). సినిమా బాగుందంటూ రెస్పాన్స్ వినిపిస్తోంది. నందమూరి అభిమానులు థియేటర్ల వద్ల పండగ చేసుకుంటున్నారు. ఓపెనింగ్స్ మంచిగా వచ్చేలా ఉన్నాయి. అయితే అప్పుడే ఓటీటీ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి వచ్చేస్తుందా అని వెతకడం ప్రారంభించేశారు.