తెలంగాణ

telangana

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న యువకులు

By

Published : Jan 26, 2021, 3:17 AM IST

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను స్థానికులు అడ్డుకున్న ఘటన మహబూబ్​ నగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలో జరిగింది. ఆ ముఠా నుంచి 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న యువకులు.. వాటిని పోలీసులకు అప్పగించారు.

young people preventing pds rice smuggling in mahabubnagar district
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న యువకులు

రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకుని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఓ ముఠాను మహబూబ్​నగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోని యువకులు అడ్డుకున్నారు. రవాణా చేసేందుకు సిద్దంగా ఉంచిన 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

జిల్లాలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్, తిరుమలాపూర్ పరిసర ప్రాంతాల్లో లబ్ధిదారుల వద్ద నుంచి కొందరు పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రేషన్ బియ్యాన్ని లారీలో ఎక్కిస్తుండగా స్థానిక యువకుల ఆపివేశారు. రెండు బొలేరో వాహనాలు, ఓ లారీ సహా 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్​కు పంపించారు. ఈ ఘటనలో అమరచింతకు చెందిన రాజశేఖర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.

ఇదీ చదవండి:మేకపిల్లను కాపాడబోయి ఇంటర్ విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details