తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏపీలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

vijayawada family suicide case , nizamabad family selfie video
విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న సురేశ్‌ సెల్ఫీ వీడియో బహిర్గతం

By

Published : Jan 10, 2022, 10:39 AM IST

Updated : Jan 10, 2022, 11:13 AM IST

10:36 January 10

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న సురేశ్‌ సెల్ఫీ వీడియో బహిర్గతం

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న సురేశ్‌ సెల్ఫీ వీడియో బహిర్గతం

Vijayawada Family suicide case selfie video : ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కుటుంబం సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని పేర్కొన్న పప్పుల సురేశ్‌ సెల్ఫీ వీడియో విడుదలైంది. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సెల్ఫీ వీడియో బహిర్గతం

అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడన్న సురేశ్‌... జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలకు పైగా వడ్డీలు చెల్లించానన్న ఆ వీడియోలో వెల్లడించారు. వడ్డీలు చెల్లించినా ఇల్లు జప్తు చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకం చేయించుకున్నారని... అధిక వడ్డీల కోసం గణేశ్‌ కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చాడని సురేశ్‌ వీడియోలో పేర్కొన్నారు. గణేశ్‌కు రూ.80 లక్షల వరకు చెల్లించినట్లు వాపోయారు. ఆ వీడియోను ఇవాళ విడుదలైంది. ఈనెల 8న నిజామాబాద్‌కు చెందిన సురేశ్‌ కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో తెలంగాణకు చెందిన బలవన్మరణం చెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లోఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్‌ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్‌ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్‌, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.

ఇదీ చదవండి: విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అంత్యక్రియలు

Last Updated : Jan 10, 2022, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details