తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cylinder Blast: గ్యాస్​ లీకై వ్యాపించిన మంటలు.. ముగ్గురు మృతి - నెల్లూరులో భారీ పేలుడు

cylinder blast in Nellore: రోజూలానే టిఫెన్స్​ వండి.. ఊర్లో అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నారు ఆ దంపతులు. తెల్లవారుజామునే లేచి.. పనులు చక్కబెట్టుకుంటున్నారు. గ్యాస్​ లీక్​ అవుతుందనే విషయం గమనించని ఆ దంపతులు.. గ్యాస్​ వెలిగించడంతో ఒక్కసారిగా (Gas Cylinder Blast in Home) మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి మూడో కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందింది.

Nellore cylinder blast
గ్యాస్​ లీకై వ్యాపించిన మంటలు

By

Published : Nov 22, 2021, 11:53 AM IST

cylinder blast in Nellore : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో అగ్నిప్రమాదం (Nellore cylinder blast) సంభవించింది. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder Blast in Home) లీకై భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

అబ్బాస్, నౌషాద్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. వీరు ఇంట్లోనే టిఫిన్​లు చేసి.. గ్రామంలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగానే ఈరోజు కూడా వంట చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే గ్యాస్ లీకైన విషయం గుర్తించన దంపతులు... గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ... మంటలు ఇళ్లంతా (Gas Cylinder Blast in Home) వ్యాపించాయి. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. చిన్నారి అయేషా తీవ్ర గాయాలపాలైంది.

చికిత్స పొందుతూ..

విషయం గుర్తించిన స్థానికులు వచ్చి తలుపులు తెరిచారు. వెంటనే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన 108 సిబ్బంది... చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అయేషా ఆసుపత్రిలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదసమయంలో భార్యాభర్తలతో పాటు చిన్న కూతురు మాత్రమే ఇంట్లో ఉంది. మిగిలిన ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లడంతో వారి ప్రాణాలు నిలిచాయి. కానీ తల్లిదండ్రులతో పాటు తమ చిన్నారి చెల్లి మృతిని జీర్ణించుకులోనే బాలికలు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details