మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పొన్నకల్కు చెందిన శ్రీనివాసులు(32) బుధవారం సాయంత్రం తన చిన్న కుమార్తెకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారి వెంట వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం గ్రామసమీపంలో ఉన్న చెరువు కట్టపై శ్రీనివాసుల మృతదేహం లభ్యమైంది.
'ఫోన్ చేసి రమ్మన్నాడు.. శవమై తేలాడు'
ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వాళ్లు వచ్చే సరికి అతని ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలో శవమై తేలాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
'ఫోన్ చేసి రమ్మన్నాడు.. శవమై తేలాడు'
మొహంపై గాయాలు ఉండటంతో కుమార్తెలు అనుమానం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్లో భార్య ఉరేసుకుని మృతి చెందగా.. ఇప్పుడు శ్రీనివాసులు అనుమానస్పదంగా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చదవండి:ఉరి వేసుకుని మైనర్ బాలుడి ఆత్మహత్య