Student Suicide in mahabubabad : స్కూల్‌కు వెళ్లలేదనే విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడనే భయంతో 9వ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన విష్ణు మహబూబాబాద్‌లోని గాదెరుక్మారెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులు పాఠశాల హాస్టల్లో ఉన్నాడు. ఆ తర్వాత రోజూ ఇంటి నుంచే పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు.
నాన్న మందలిస్తాడనే భయం.. తొమ్మిదో తరగతి విద్యార్థి బలవన్మరణం - తెలంగాణ తాజా వార్తలు
Student Suicide in mahabubabad : పిల్లలకు తలిదండ్రులంటే భయం ఉండటం సహజమే. అది అతిగా మారితే అనర్థాలకు దారి తీస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లలేదన్న విషయం తన తండ్రికి తెలిస్తే మందలిస్తాడేమోనన్న భయంతో ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య
ఈ క్రమంలోనే తన తండ్రి పొలంలో కలుపు తీస్తున్న రోజు విష్ణు పాఠశాలకు వెళ్లకుండా తండాలోనే ఉన్నాడు. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే మందలిస్తాడనే భయంతో 4 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: