కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలో ఇసుక అక్రమరవాణా చేస్తున్న ట్రాక్టర్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల పట్టివేత - ఇసుక ట్రాక్టర్లు సీజ్
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను సీజ్ చేశారు.
sand tractors, tractors seized
పెద్దవాగు నుంచి కొంతకాలంగా ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:భద్రాద్రిలో 178 కిలోల గంజాయి స్వాధీనం