తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2022, 5:40 PM IST

Updated : Apr 25, 2022, 7:11 PM IST

ETV Bharat / crime

శంషాబాద్​ విమానాశ్రయంలో రూ. 21.9 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

heroin was seized in shamshabad airport
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత

17:37 April 25

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత

ప్రయాణికురాలి బ్యాగులో లభ్యమైన హెరాయిన్​ కవర్లు

Heroin Seized in Shamshabad Airport: డ్రగ్స్​ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా.. అక్రమంగా సరఫరా మాత్రం ఆగడం లేదు. ఎక్కడో చోట గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాల రవాణా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో మత్తు లభ్యమవడం కలవరపెడుతోంది. తాజాగా మరోసారి శంషాబాద్​ విమానాశ్రయంలో భారీ ఎత్తున హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ మొత్తంలో హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 21.90 కోట్లు విలువైన 3.129 కిలోల హెరాయిన్‌ను ప్రయాణికురాలి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నైరోబి నుంచి డోహ్‌ మీదుగా.. బిజినెస్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చిన మాలవ్యన్‌ దేశస్థురాలు లగేజీని అధికారులు సోదాలు చేశారు. ట్రాలీ బ్యాగ్‌ అడుగుభాగాన రెండు ప్లాస్టిక్‌ కవర్లలో ఈ మాదకద్రవ్యాలను దాచి తెచ్చినట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. అది హెరాయిన్‌ అని తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో రూ.21.90 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ ప్రయాణికురాలిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు... జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:Family suicide attempt: 'అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి'

ఆరు నెలల ఖర్చుకు సరిపడా డబ్బు రెడీగా ఉండాల్సిందే.. లేదంటే...

పీకే​కు కాంగ్రెస్​ షరతు.. అందుకు ఓకే అంటేనే పార్టీలోకి.. తెరాస, వైకాపాతో కటీఫ్​?

Last Updated : Apr 25, 2022, 7:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details