తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో లారీ.. బైకును ఢీ కొట్టిన ఘటనలో.. ఓ హెడ్ కానిస్టేబుల్ మరణించారు. మృతుడు.. తెలంగాణలోని నల్గొండలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మిత్రుడి పదవీ విరమణకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి!
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

By

Published : Feb 4, 2021, 9:38 AM IST

మిత్రుడి పదవీ విరమణ వేడుకకు వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్.. రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాదకర ఘటన.. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తెనాలికి చెందిన వేల్పుల శ్రీనివాసరావు.. తెలంగాణలోని నల్గొండలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. ఆయన.. మిత్రుడి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నరసరావుపేట వెళ్లారు.

విజయవాడలో రైల్వే టికెట్ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్న కోటిరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఫిరంగిపురం సమీపంలో వారి వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. శ్రీనివాసరావు గాయాలపాలై.. అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన కోటిరెడ్డిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్

ABOUT THE AUTHOR

...view details