తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cp Mahesh Bhagwat on Drugs: 'రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చడమే లక్ష్యం'

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌ కట్టడిపై ముమ్మర చర్యలు చేపట్టారు. తరచూ దాడులు నిర్వహిస్తున్నామని చెబుతున్న సీపీ మహేష్‌ భగవత్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Cp Mahesh Bhagwat on Drugs
'రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చడమే లక్ష్యం'

By

Published : Feb 2, 2022, 10:57 AM IST

రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌ భగవత్‌తో... ముఖాముఖి

కొకైన్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌, అతడికి సహకరిస్తున్న ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 38 గ్రాముల కొకైన్‌, రూ.22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

నాలుగుసార్లు జైలుకెళ్లొచ్చినా..

నైజీరియా నివాసి మార్క్‌ ఒవలబి(41) 2012లో వ్యాపార వీసాపై ముంబయి చేరాడు. వస్త్రాలు కొనుగోలు చేసి నైజీరియా ఎగుమతి చేసేవాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండటంతో ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక 2018లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. బంజారాహిల్స్‌లో పారామౌంట్‌హిల్స్‌ అపార్టుమెంటులో ప్లాట్‌ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. కొకైన్‌ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. 2018లో నార్సింగి, 2019 అమీర్‌పేట్‌, 2021 గోల్కొండ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే బాట పట్టాడు.

నేరేడ్‌మెట్‌లో ఉంటున్న తోట హర్షవర్ధన్‌(23), గుణపోగుల స్వామిప్రసాద్‌(23), దుడ్డు ప్రవీణ్‌కుమార్‌(21), అభిషేక్‌ సింగ్‌ మిత్రులు. వీరంతా జల్సాల కోసం మత్తు పదార్థాల అమ్మకం ప్రారంభించారు. మాదకద్రవ్యాల కేసులో శిక్ష అనుభవిస్తున్న అభిషేక్‌ సింగ్‌ స్నేహితుడికి, జైలులో మార్క్‌ ఒవలబితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి ఇద్దరు ఒకేచోట కొకైన్‌ కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించడం ప్రారంభించారు.

ఈ ముఠాపై నిఘా పెట్టిన ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు.. మార్క్‌ ఒవలబితో కొకైన్‌ తీసుకొని నేరెడ్‌మెట్‌కు వస్తున్నట్టు గుర్తించారు. అక్కడ హర్షవర్ధన్‌, పవన్‌కుమార్‌, స్వామిప్రసాద్‌లకు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 38 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అభిషేక్‌సింగ్‌ పరారీలో ఉన్నాడు. సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీలు రక్షితాకృష్ణమూర్తి, యాదగిరి పాల్గొన్నారు.

ఇదీ చదవండి :తీవ్రంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్​ ఉప వేరియంట్​

ABOUT THE AUTHOR

...view details