తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిద్రిస్తున్న వారిపై కారంపొడి చల్లి... గొడ్డలితో నరికేశాడు.. - గొడ్డలి వార్తలు

ఉగాదిని బంధువులతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్​ నుంచి జనగామ వెళ్లింది ఓ కుటుంబం. వేసవి కావడంతో ఆరుబయటే పడుకున్నారు. అంతలోనే ఓ అంగంతుకుడు వచ్చాడు. వారిపై కారంపొడి చల్లి... ఓ యువకుడిని గొడ్డలితో కసి తీరా నరికేశాడు. అడ్డుపడిన అతని బంధువును సైతం తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో చోటు చేసుకుంది.

murder-with-axe-one-died-happens-in-jangaon-district
నిద్రిస్తున్న వారిపై కారంపొడి చల్లి... గొడ్డలితో నరికేశాడు..

By

Published : Apr 13, 2021, 7:03 AM IST

జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారిపై గుర్తుతెలియని వ్యక్తి కారంపొడి చల్లి గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో వంగల దినేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... అతనిని కాపాడేందుకు యత్నించిన మృతుని బాబాయి వంగల మహేష్​కు తీవ్రగాయాలయ్యాయి.

వారి అరుపులు విన్న స్థానికులు ఘటనాస్థలికి రావడంతో... దుండగుడు గొడ్డలిని అక్కడే వదిలి పరారయ్యాడు. హైదరాబాద్​లో నివసిస్తున్న గ్రామానికి చెందిన వంగల సోమనర్సయ్య ఉగాది పండుగ సందర్భంగా తన కొడుకు దినేష్​తో కలిసి సోమవారం రాత్రి గ్రామానికి వచ్చాడు. పండుగ రోజు ఇంటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి చేరుకుని... వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి:ప్రియురాలి బంధువుల దాడి.. ప్రియుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details