తెలంగాణ

telangana

ETV Bharat / crime

'నా చావుకు ఎవరూ కారణం కాదు.. జీవితంపై విరక్తితో చనిపోతున్నా'

నా చావుకు ఎవరూ కారణం కాదు. అందరూ మంచివాళ్లే. అమ్మ, నాన్నను బాగా చూసుకోండి అంటూ సూసైడ్​ నోట్​ రాసి తనువు చాలించాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

gurukul school senior assistant suicide
ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సీనియర్​ అసిస్టెంట్​ ఆత్మహత్య

By

Published : Apr 20, 2021, 5:21 AM IST

జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరిమడ్ల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న మల్లేశం నేత తనువు చాలించాడు.

అమ్మ, బాపును బాగా చూసుకోండి

అందరూ చాలా మంచివాళ్లు. నా చావుకు ఎవరూ కారణం కాదు. మా పెద్దక్క, చిన్నక్క, మా చెల్లి, బావలు అందరూ అమ్మ, బాపును బాగా చూసుకోండి. నాకు రావాల్సిన ఆస్తి మొత్తం శ్రీకాంత్, సన్నీకి ఇవ్వండి. నా జీవితంలో ఎన్నో కష్టసుఖాలను చూశాను అని లేఖలో పేర్కొన్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ అద్దె గదిలోని బాత్​రూమ్​లో ఆత్మహత్య చేసుకున్నాడు.

నన్ను క్షమించండి

నా 22 సంవత్సరాల గురుకుల పాఠశాల జీవితంలో ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించండి. నాతో జర్నీ చేసిన మిత్రులందరికీ నమస్కారం ఇక సెలవు అంటూ సూసైడ్ నోట్​లో మల్లేశం పేర్కొన్నాడు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై కిషన్ రావు పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ఫీడ్ ది నీడ్ బృందానికి సీపీ సజ్జనార్ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details