మోసం చేసేవాళ్లు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆశాపరులను(Cheating customers with Offers) చిత్తు చేస్తున్నారు. వారి జేబులకు కన్నం వేస్తున్నారు. భారీ డిస్కౌంట్(big discount offers) పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారి సరి కొత్త మోసానికి పాల్పడి రూ. 75 లక్షల రూపాయలతో ఉడాయించాడు.
దోచేశారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో 25 రోజుల కిందట ప్రారంభించిన గోల్డెన్ ఏజెన్సీ(golden agency order suppliers) ఆర్డర్ సప్లయర్స్ బోర్డు(Cheating customers with Offers) తిప్పేసింది. తమిళనాడు తంజావూరుకు చెందిన అయ్యప్పన్ అనే వ్యాపారి.. అసలు ధర మీద 40 శాతం తగ్గింపుతో ఇంటి ఫర్నిచర్ ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచాడు. ప్రజల నుంచి భారీగా ఆర్డర్ రూపంలో వసూలు చేసిన సొమ్ముతో అయ్యప్పన్ ఉడాయించాడు.
ఆశపడితే..
కొన్ని పేరున్న కంపెనీల మంచాలు, సోఫాలు, పరుపులు, కుర్చీలు, బల్లాలతో పాటు అనేక రకాల హోం ఫర్నిచర్‌తో భారీ ఎత్తున బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ఏజెన్సీ సభ్యులు ప్రచారం చేశారు. తక్కువ ధరలకు ఇస్తామని నమ్మబలికి , డబ్బులు చెల్లించిన 12 రోజులకు వస్తువులు ఇస్తామని ప్రజలకు చెప్పారు. నిజమేనని నమ్మిన వినియోగదారులు ఒక్కొక్కరు రూ. 20 నుంచి 30 వేల వరకు చెల్లించారు. అయితే మొదట్లో 12 రోజులు పూర్తైన వారికి ఫర్నిచర్(Cheating customers with Offers) అందజేయటంతో తమకూ అలాగే ఇస్తారని ఆశతో చాలా మంది ఈ స్కీంలో చేరారు. ఇలా దాదాపు 250 మంది వరకు డబ్బులు చెల్లించారు.