నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని కుమురం భీం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ వి. సత్యనారాయణ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం చింతలమానేపల్లి మండలంలో పట్టుకున్న నిషేధిత పత్తి విత్తనాల వివరాలను ఆయన వెల్లడించారు. మండలంలోని గూడెంలో భారీగా నిషేధిత విత్తనాలు నిల్వ ఉంచారనే సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసు సిబ్బంది ఓ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో 21 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 42 లక్షల వరకు ఉంటుందని సత్యనారాయణ తెలిపారు.
నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: రామగుండం సీపీ
నకిలీ విత్తనాల మాఫియాను ఉపేక్షించేది లేదని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. నిషేధిత విత్తనాలు అమ్మి రైతుల కష్టాన్ని దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని ఓ గూడెంలో నకిలీ విత్తనాల నిల్వలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారు.
నకిలీ విత్తనాల దందా
అధిక దిగుబడి వస్తుందని చెప్పి రైతులకు నకిలీ, నిషేధిత విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు చేపడతామని సీపీ హెచ్చరించారు. రైతుల కష్టాన్ని దోచుకుంటూ అక్రమ వ్యాపారం చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు. నకిలీ విత్తనాల మాఫియాపై ఆరా తీస్తున్నామని ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఈ బిజ్ డాట్ కామ్‌కు చెందిన మరో రూ.31.63 కోట్ల ఆస్తులు అటాచ్