తెలంగాణ

telangana

ETV Bharat / crime

AUTO FIRE: కడుపు మండింది... నడిరోడ్డు మీదే ఆటోనే కాల్చేశాడు! - telangana varthalu

రోజంతా వాహనం నడిపితేనే వాళ్ల కడుపు నిండుతుంది. ఫైనాన్స్​లో వాహనం తీసుకుంటే సగం దానికే వెళ్లిపోతుంది. డబ్బుల కోసం ఫైనాన్షియర్​ వేధింపులు తాళలేక ఓ డ్రైవర్​ తన ఆటోను తగులపెట్టుకున్న ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పెరుగుతున్న పెట్రోల్​ ధరల దృష్ట్యా డబ్బులు కట్టలేక జీవనోపాధి కోల్పోయానని ఆటో డ్రైవర్​ ఆవేదన వ్యక్తం చేశాడు.

AUTO FIRE:  ఫైనాన్స్​ వేధింపులతో తన ఆటోను తగులపెట్టుకున్న డ్రైవర్​
AUTO FIRE: ఫైనాన్స్​ వేధింపులతో తన ఆటోను తగులపెట్టుకున్న డ్రైవర్​

By

Published : Aug 28, 2021, 4:54 PM IST

AUTO FIRE: ఫైనాన్స్​ వేధింపులతో తన ఆటోను తగులపెట్టుకున్న డ్రైవర్​

ఫైనాన్షియర్‌ వేధింపులతో హనుమకొండలో ఓ డ్రైవర్ తన ఆటోను తగులపెట్టుకున్నాడు. డబ్బుల కోసం రోజూ ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. కాళోజి కూడలి వద్ద శ్రీనివాస్‌ అనే ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసి వాహనానికి నిప్పంటించాడు. నడిరోడ్డుపై ఆటో తగులపడుతుండగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయింది.

కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డానని.. కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదని శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గిరాకీ లేదని.. పెట్రోల్‌ ధరల పెరుగదల వల్ల ఏమీ మిగలడం లేదని గోడు వెల్లబోసుకున్నాడు. ఫైనాన్స్​ వాళ్లు కూడా డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆటో డ్రైవర్​ వాపోయాడు.

ఇదీ చదవండి:SUSPICIOUS DEATH: పెళ్లి బరాత్​లో యువకుడి మృతి.. అసలేం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details