తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2021, 9:15 AM IST

Updated : Dec 2, 2021, 10:18 AM IST

ETV Bharat / crime

ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్.. రుణాలిస్తామని కోట్లల్లో మోసం

CALL CENTERCALL CENTER
ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్.. రుణాలిస్తామని కోట్ల మోసం

09:10 December 02

ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్ గుట్టురట్టు

SBI Call Center: బ్యాంక్​ అధికారులమని.. అమాయకులకు ఫోన్​లు చేసి.. వారి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న ముఠాను సైబర్​బాద్​ సైబర్​ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్​ను దిల్లీలో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న ముఠాను సైబర్​బాద్​ పోలీసులు పట్టుకున్నారు.

ఎస్​బీఐ పేరుతో తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ముఠా సభ్యులు కోట్లు కొల్లగొట్టారు. ప్రజలను నకిలీ కాల్​సెంటర్​తో మోసం చేస్తున్న 14 మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్‌సెంటర్‌కు చెందిన వారి ఖాతాల్లోని నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌బీఐ కేవైసీ, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

నకిలీ కాల్​సెంటర్​పై సమాచారం అందుకున్న పోలీసులు 'ధని లోన్‌ బజార్‌' కాల్‌సెంటర్‌పై దాడులు చేశారు. దిల్లీ కేంద్రంగా నడుస్తున్న 'ధని లోన్ బజార్' కాల్‌సెంటర్‌పై దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. నిందితులు మొత్తం 27 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.

Last Updated : Dec 2, 2021, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details