తెలంగాణ

telangana

ETV Bharat / crime

మల్కాజి​గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా సోదాలు.. - మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేర వార్తలు

ACB Searches in Sub Registrar House: మల్కాజి​గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నారు. పళని బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Sub Register
Sub Register

By

Published : Oct 20, 2022, 5:11 PM IST

ACB Searches in Sub Registrar House: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై.. మల్కాజిగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ పళనికుమారి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్​పీ శ్రీనివాస్ బృందం తనిఖీలు జరుపుతోంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలోని వినాయకనగర్‌లో సోదాలు జరిపిన అనిశా అధికారులు.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏకకాలంలో పళని బంధువుల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. రాత్రి వరకూ తనిఖీలు జరిగే అవకాశముందని సమాచారం. సోదాలు పూర్తైన తర్వాతే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details