వికారాబాద్ జిల్లా పరిగి మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి సంబంధించి 20 గ్రామాల్లో 770 సైన్ బోర్డులు బంటు చక్రవర్తి అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. వీటికి రూ.10 లక్షల బిల్లు అవ్వడం వల్ల ఎంబీ చేయమని ఎంపీడీఓ సుభాశ్ చంద్ర గౌడ్‌ను అడిగాడు. ఈ పని చేయడానికి సుభాశ్ రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. అంత డబ్బు తను ఇచ్చుకోలేనని చక్రవర్తి చెప్పినా.. అడిగిన నగదు ఇస్తే తప్ప బిల్లు పాస్ చేయనని తెగేసి చెప్పాడు.
అత్యాశకు పోయి అనిశాకు అడ్డంగా దొరికిన అధికారులు
అత్యాశకు పోయి అధికారులు అడ్డంగా దొరికిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఎనిమిది మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చక్రవర్తి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందు రూ. 2లక్షలు ఇస్తానని.. మిగిలిన డబ్బు తర్వాత ఇస్తానని ఫోన్ ద్వారా ఎంపీడీఓకు చెప్పాడు. ఎంపీడీఓ సుభాశ్.. రూ.2 లక్షలను ఈసీ రఫీకి ఇవ్వాలని చెప్పగా.. చక్రవర్తి పరిగి పట్టణంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఈసీకి డబ్బు అప్పజెప్పాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అనిశా అధికారులు రఫీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రఫీతో పాటు ఏపీఓ నర్సింహులు, టెక్నిక్ అసిస్టెంట్లు, ఏసీబీ అధికారులు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- ఇదీ చదవండి :విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టి... హత్య