తెలంగాణ

telangana

గోదావరి నదిలో దూకిన యువకుడు.. కుటుంబ కలహాలే కారణమా..!

By

Published : Aug 16, 2021, 1:22 AM IST

కుటుంబ కలహాలతో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. యువకుడి కోసం గాలిస్తున్నారు.

suicide attempt
suicide attempt

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి వంతెనపై నుంచి ఓ యువకుడు నదిలో దూకాడు. ద్విచక్రవాహనాన్ని గోదావరి వంతెనపై నిలిపి ఉంచి అనంతరం నదిలో దూకాడు. గమనించిన తోటి ప్రయాణికులు స్పందించే లోపే అతడు నీటిలో మునిగిపోయాడు. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ద్విచక్రవాహనం నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టి .. నదిలో దూకిన వ్యక్తి బూర్గంపాడు మండలం పినపాక వాసి ఉపేందర్‌గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే యువకుడు గోదావరిలో దూకినట్టు తెలుస్తోంది. ఉపేందర్‌ కోసం గాలింపు కొనసాగుతోంది.

ఇదీ చూడండి:accident : లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. 30 మందికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details