గంజాయిపై(ganja seized) ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్(telangana CM KCR) ఆదేశాలు జారీ చేసిన రోజు నుంచి రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు(telangana state police), ఆబ్కారీ అధికారులు(telangana excise officers) గంజాయి కట్టడికి(to prevent ganja usage) పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న(illegal transport of ganja) వారిపై ప్రత్యేక దృష్టి సారించి.. ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాటిని తరలించే వారికి నిద్రపట్టకుండా చేస్తున్నారు.
ganja seized in Hyderabad : రూ.2.08 కోట్లు విలువ చేసే గంజాయి సీజ్
09:49 November 15
రూ.2.08 కోట్లు విలువ చేసే గంజాయి సీజ్
హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా(illegal ganja transport) చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా(inter state gang arrested)ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 1,240 కిలోల గంజాయిని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గాంజా విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. విశాఖపట్నం సీలేరు నుంచి మహారాష్ట్రకు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నారన్న(ganja smuggling) పక్కా సమాచారంతో పోలీసులు గంజాయి ముఠాను పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్టు చేశారు(three arrrested). పరారీలో ఉన్న మరో ముగ్గురికి కోసం గాలిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న ప్రధాన నిందితుడు షేక్ యాసిన్‌కు కరోనా లాక్‌డౌన్ సమయంలో తీవ్ర నష్టాలు రావడంతో... గంజాయి దందాలోకి దిగినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్(Rachakonda CP Mahesh Bhagwat) తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్‌తో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు..
గంజాయి తరలింపు(Cannabis transport prevention)ను కట్టడి చేయడానికి చెక్‌పోస్టులు(police check posts) ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు భారీగా గంజాయి పట్టుబడింది. గాంజాపై అధికారులు చర్యలు ప్రారంభించడంతో వారికి పట్టుబడతామనే భయంతో కొందరు ఈ దందాను కొన్నిరోజుల వరకు మానేశారు. కానీ గంజాయికి అలవాటైన వారు మరో కొత్త తప్పు చేయడానికి పురిగొల్పింది. గంజాయిని తరలిస్తుంటే.. పోలీసులు అడ్డుకుంటున్నారనే.. ఇంట్లోనే మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. గాంజాకు బానిసైన వారు ఓవైపు.. మరోవైపు వారి అలవాటును ఆసరా చేసుకుందామనుకున్న వారు ఇంటి ఆవరణలో, పూలకుండీల్లో, పంట మధ్యలో గాంజా సాగు(ganja cultivation) చేస్తున్నారు.
"గంజాయి వాడకం(ganja usage) అనేక అనర్థాలకు దారితీస్తుంది. బాధితుల్లో ఆందోళన, గుండె దడ, గుండెపోటు, మానసిక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం గంజాయి(ganja addicts) తీసుకుంటే కానబనాయిడ్ హైపరమెసిస్ సిండ్రోమ్ (సీహెచ్‌ఎస్) అనే రుగ్మతతో బాధపడతారు. పదే పదే వికారం కలుగుతూ వాంతులవుతాయి. కొన్ని సందర్భాల్లో అది మరణానికీ దారితీస్తుంది. ఒకటి రెండు వారాలు గంజాయి తీసుకుని ఆపేసిన వారిలోనూ భయం, వణుకు, నిద్రలేమి, ఆకలి తగ్గడం, చెమటలు పట్టడం, మానసిక పరిస్థితి సవ్యంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ద్రవ, స్ప్రే రూపంలో గంజాయి తీసుకుంటే- తలనొప్పి, మగత, పొడినోరు, వికారం, మతిస్థిమితం దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. గంజాయిని పొగ రూపంలో సేవిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ప్రాణాలే పోతాయి." అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఇదీ చదవండి : రూ.600 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత