తెలంగాణ

telangana

ETV Bharat / crime

నకిలీ పత్రాలతో 'ఐవోబీ'లో రూ.1.39 కోట్లు కాజేశారు!

ఇండియన్ ఓవర్సీస్​ బ్యాంకులో రూ.1.39 కోట్లకు టోకరా వేశారు కొందరు కేటుగాళ్లు. నకిలీ పత్రాలు సమర్పించి భారీ మొత్తంలో కాజేశారు. ఐవోబీ చీఫ్ రీజనల్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కీలక సూత్రధారితో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు.

By

Published : Jul 15, 2021, 4:25 PM IST

నకిలీ పత్రాలతో 'ఐవోబీ'లో రూ.1.39 కోట్లకు టోకరా
నకిలీ పత్రాలతో 'ఐవోబీ'లో రూ.1.39 కోట్లకు టోకరా

నకిలీ పత్రాలతో హైదరాబాద్​లోని ఓ ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంకులో రూ.1.39 కోట్ల మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పీఎమ్​ఈజీపీ ( ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) పథకం కింద బ్యాంకులో నకిలీ ఇన్వాయిస్​లు, అగ్రిమెంట్ల పత్రాలతో 8 మంది రుణాలు తీసుకున్నారు. సంబంధిత పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంకు చీఫ్ రీజనల్ మేనేజర్ సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ సిగ్నల్స్​ ఆధారంగా హైదరాబాద్​కి చెందిన కీలక సూత్రధారి శ్రీనివాస్ నాయక్​తో పాటు రవి అనే మరో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: Love Affair: శారీరకంగా ఒక్కటై.. పెళ్లనగానే ముఖం చాటేశాడు

ABOUT THE AUTHOR

...view details