CYBER CRIME: బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం - జాయింట్ అకౌంట్ నుంచి భారీగా నగదు మాయం
21:53 August 19
CYBER CRIME: బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం
తన కుటుంబానికి చెందిన జాయింట్ ఖాతాలో నగదు తీసుకోడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. తమ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 1.20 కోట్లు వేరే ఖాతాకు బదిలీ అయ్యినట్లు వచ్చిన మెసేజ్‌తో ఖంగుతిన్నది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
ఖైరతాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఉంది. తన కుటుంబంలోని తల్లిదండ్రులు, సోదరుడు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే తమ జాయింట్ అకౌంట్ నుంచి రూ. 2కోట్లు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించగా... రూ. 1.20కోట్లు వేరొకరి ఖాతాకు బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:రూ.3,316 కోట్ల మోసం.. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ అరెస్టు