తెలంగాణ

telangana

ETV Bharat / city

శివపార్వతుల కల్యాణ ఘట్టాన్ని తిలకించే... భక్తులు జన్మ ధన్యమైందంటూ పరవశించే... - యాదాద్రి దేవస్థానం తాజా వార్తలు

shivaratri utsavalu in yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొండపై కొలువై ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి (శివ బాలాలయం) క్షేత్రంలో మూడో రోజు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం రాత్రి ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది.

shivaratri utsavalu in yadadri
శివపార్వతుల కల్యాణ ఘట్టం

By

Published : Mar 1, 2022, 11:46 AM IST

shivaratri utsavalu in yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతూ కొండ పైన కొలువై ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివ బాలాలయం) క్షేత్రంలో మూడో రోజు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

శివపార్వతుల కల్యాణ ఘట్టం

తమ జన్మ ధన్యమైందంటూ...

ఉత్సవాల్లో భాగంగా ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా సాగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణ ఘట్టం దాదాపు రెండు గంటల పాటు వైభవంగా జరిగింది. మొదట కల్యాణ మండపంలో ఆదిదంపతులను అధిష్ఠింపజేసి అర్చకులు కల్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల కళతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా కైలాసవాసుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో శివాలయ ప్రాంగణం "ఓం నమఃశివాయ, శంభోశంకర" అనే నామస్మరణతో మార్మోగింది.

శివపార్వతుల కల్యాణ ఘట్టం

పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. శివపార్వతుల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనందపరవశులైనారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు.

ఇదీ చదవండి:sivalayam in yadadri: యాదాద్రిలో శివాలయ ఉద్ఘాటన.. త్వరలో అధికారిక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details