లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక.. స్వస్థలాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక.. కాలి నడకన చత్తీస్గఢ్ బయలుదేరిన 40 మంది వలస కూలీలు సూర్యాపేట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చత్తీస్గఢ్ బయలుదేరిన వలస కూలీలు ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని రెడ్డిగూడెం దగ్గర ఆగారు. అలసిపోయి గ్రామ సమీపంలో సేద తీరుతుండగా.. అరవపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ఇమిడి సోమయ్య వారికి స్వయంగా ఆహారం వండి వడ్డించారు. కాలినడకన బయల్దేరిన వలస కూలీలు మూడు రోజుల తర్వాత భోజనం దొరకడం వల్ల కడుపు నిండా తిని.. మాజీ సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. దారిలో హోటల్స్ అన్నీ మూసి ఉండడం వల్ల భోజనం కూడా దొరకడం లేదని, సరైన సమయంలో మా ఆకలి తీర్చాడని వలస కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.
వలస కూలీల ఆకలి తీర్చిన మాజీ సైనికుడు - Ex Soldier Arrange food for immigration labor
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక.. చేతిలో డబ్బులు లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన వలస కూలీలను మాజీ సైనికుడు ఇమిడి సోమయ్య ఆపి అన్నం పెట్టారు.
![వలస కూలీల ఆకలి తీర్చిన మాజీ సైనికుడు Ex Soldier Arrange food for immigration labor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6975974-444-6975974-1588075694013.jpg)
వలస కూలీల ఆకలి తీర్చిన మాజీ సైనికుడు