తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2020, 2:08 PM IST

ETV Bharat / city

కన్నులపండువగా.. సీతారాముల కల్యాణ వసంతోత్సవం!

భద్రాచల సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిపే.. వసంతోత్సవం కన్నుల పండువగా జరిగింది.

Vasantha Utsavam In Bhadrachalam Temple
కన్నులపండువగా.. సీతారాముల కల్యాణ వసంతోత్సవం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల వారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త సన్నాహక శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద సీతారాములకు అర్చకులు వసంతోత్సవం నిర్వహించారు.

ప్రధాన ఆలయం నుంచి సీతారాముల దేవతా మూర్తులను నిత్య మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సీతారాములను ఎదురెదురుగా కూర్చోబెట్టి బుక్కా రంగును నీళ్లలో కలిపి అర్చకులు వసంతోత్సవం నిర్వహించారు. విగ్రహాల మీద చల్లిన రంగునీళ్లను భక్తులు ఒకరి మీద ఒకరు చల్లుకొని వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. ఈ ఏడాది లాక్​డౌన్ నేపథ్యంలో భక్తులను ఉత్సవాలకు అనుమతించలేదు. కేవలం అర్చకులు మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఇవీచూడండి:'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details