పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి రోజున... ప్రచారం హోరెత్తుతోంది. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ మైదానంలో ఎంపీ నామ నాగేశ్వరరావు... ప్రచారం నిర్వహించారు. వాకర్స్‌ను కలిసిన నామ... పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు.
'అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది' - mlc elections campaign news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. నేడు చివరిరోజు కావటం వల్ల... రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చివరి రోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు.
mp nama nageshwara rao campaign in khammam
పోరాడి సాంధించుకున్న రాష్ట్రంలో అన్ని సమస్యలు అధిగమిస్తూ ముందుకుపోతున్నామని ఎంపీ తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ రంగాలను ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలవాల్సి అవసరం ఉందని నామ వ్యాఖ్యానించారు.