సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ చంద్రశేఖర్ కరోనా నివారణలో ప్రజలు, ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకం అన్నారు. పోలీసులు, వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు చేస్తున్న కృషి కూడా అభినందనీయం అన్నారు.
పోలీసులకు సహకరించండి : డీఎస్పీ చంద్రశేఖర్ - Siricilal Dsp Awareness On Corona Virus
కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని, ప్రజా ప్రతినిధులు ఆ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ అన్నారు.
పోలీసులకు సహకరించండి : డీఎస్పీ చంద్రశేఖర్
లాక్డౌన్ తర్వాత కూడా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఏ రోగం దరిచేరదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సర్వర్, ఎంపీపీ పడిగెల మానస, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:దివ్యాంగ న్యాయవాదిని చావబాదిన ఎస్సైపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు