తెలంగాణ

telangana

ETV Bharat / city

కరీంనగర్​లో అటవీ సంపదకు పూర్వ వైభవం: గంగుల - గంగుల కమలాకర్​ వార్తలు

జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని మంత్రి గంగుల అన్నారు. కరీంనగర్​లో అటవీ సంపదకు పూర్వ వైభవం రావాలంటే మొక్కలు నాటడమే కాకుండా.. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి గుర్తు చేశారు. నగర మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పలుప్రాంతాల్లో మొక్కలు నాటారు.

కరీంనగర్​లో అటవీ సంపదకు పూర్వ వైభవం: గంగుల
కరీంనగర్​లో అటవీ సంపదకు పూర్వ వైభవం: గంగుల

By

Published : Jul 14, 2020, 6:08 AM IST

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 50లక్షల మొక్కలు నాటి అటవీ సంపదకు పూర్వ వైభవం తీసుకొస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్​ నగరంలో మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పలుప్రాంతాల్లో మొక్కలు నాటారు. జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. అందువల్ల అటవీ సంపదలో పూర్వ వైభవం రావాలంటే మొక్కలు నాటడమే కాకుండా ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి గుర్తు చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రప్రభుత్వం చెట్లు పెంచడానికి ప్రాధాన్యతనిస్తోందని.. నాటిన మొక్కల్లో 85శాతం సంరక్షించని పక్షంలో ప్రజాప్రతినిధులు పదవులను కోల్పోతారనే నిబంధన తీసుకొచ్చారని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details