తెలంగాణ

telangana

ETV Bharat / city

బరాత్​లో యువకుల హల్​చల్​.. తల్వార్లు, కత్తులతో నృత్యాలు

ఓ బరాత్​లో తల్వార్లు, కత్తులతో ప్రమాదకరంగా నృత్యాలు చేసిన యువకుల వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఆ వీడియోలో పోలీసులకు చేరడంతో.. కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. శాంతి విఘాతం కలిగించే అవకాశమున్న ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

By

Published : Jul 20, 2021, 10:58 PM IST

youth dance with swords in baraat in hyderabad old city
youth dance with swords in baraat in hyderabad old city

హైదరాబాద్​ పాతబస్తీలోని భవానీనగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన ఓ బరాత్​లో యువకులు హల్​చల్​ చేశారు. డీజే పాటలకు చేతుల్లో కత్తులు, పెద్దపెద్ద తల్వార్​లు పట్టుకుని నృత్యాలు చేసిన యువకుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలు వైరల్​ అవుతూ.. భవానీ నగర్​ పోలీసులకు చేరాయి. కత్తులు, తల్వార్​లతో ప్రమాదకరంగా నృత్యాలు చేస్తున్న వీడియో చూసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

బరాత్​లో యువకుల హల్​చల్​.. తల్వార్లు, కత్తులతో నృత్యాలు

సోషల్​ మీడియాలో వైరల్​గా మారి..

ఈ నెల 16వ తేదీన నశేమన్​నగర్ ప్రాంతంలో ఈ బరాత్​ జరిగినట్లు దర్యాప్తులో తెలిసింది. ఎండీ తజముల్ హుస్సేన్ అనే యువకుని ఆధ్వర్యంలో జరిగిన బరాత్​లో 8 మంది యువకులు పాల్గొన్నారు. పియానో, బ్యాండ్​లతో తీసిన ఈ బరాత్​లో పెద్దపెద్ద తల్వార్లు, కత్తులతో యువకులు నృత్యాలు చేశారు. ఈ డ్యాన్సులను కొంత మంది ఆసక్తిగా వీక్షించగా... మరి కొంత మంది యువకులు ఈ తతంగాన్ని చరవాణుల్లో బంధించారు. అక్కడితో ఆగకుండా.. ఈ ఘనకార్యాన్ని అత్యుత్సాహంతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. అవి కాస్తా వైరల్​గా మారి.. నేరుగా వెళ్లి పోలీసుల చేతికి చిక్కాయి.

మారణాయుధాలతో ఆటలు శిక్షార్హం..

మారణాయుధాలతో బహిరంగంగా ఇలాంటి నృత్యాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటమే కాకుండా... వీటిని చూసి ప్రభావితమై మిగతా వాళ్లు కూడా పాటించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలో ఉన్న యువకులు ఎవరు..? వారికి ఈ తల్వార్లు, కత్తులు ఎక్కడివి..? బరాత్​ దేని గురించి తీశారు...? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదాలకు అవకాశమున్న ఏ చర్యలైనా శిక్షార్హమేనని పోలీసులు హెచ్చరించారు. శాంతికి విఘాతం కలిగించేలా బహిరంగా ప్రదేశాల్లో మారణాయుధాల ప్రదర్శన నిషేధితమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Minister Gangula: 'గుట్కా, తంబాకు తినాలంటే నాలుగు గోడల మధ్య తింటం'

ABOUT THE AUTHOR

...view details